Shivraj Singh Chouhan : గత జగన్ ప్రభుత్వం మూడేళ్లపాటు వారికి డబ్బులు ఇవ్వలేదు : కేంద్రమంత్రి చౌహాన్
ఆంధ్రప్రదేశ్‌లో గత జగన్ ప్రభుత్వం (Jagan government) ప్రధానమంత్రి ఫసల్ భీమా కింద రైతులకు డబ్బులు ఇవ్వలేదని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan ) తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై రాజస్థాన్ ఎంపీ (Rajasthan MP) హనుమాన్ బేనివాలా (Hanuman Beniwala) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చౌహాన్ సమాధానమిచ్చారు. కొన్ని సార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదని, మరి కొన్ని సార్లు ఆలస్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయినా, కేంద్రప్రభుత్వం వాటా ప్రకారం రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. జగన్ సర్కారు మూడేళ్లపాటు రైతులకు ఫసల్‌బీమా యోజన డబ్బులు ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసిందన్నారు. రాష్ట్రాలు సకాలంలో వారి వాటా ఇవ్వకపోతే 12 శాతం వడ్డీ కలిపి రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందన్నారు.







