శ్రీవారి దర్శనంపై 28న నిర్ణయం!
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. అధికారికంగా వెల్లడించకపోయినా, టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు చర్చించుకుని ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ ఎత్తివేశాక తొలుత స్థానికులకు రోజుకు 5 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. లోటుపాట్లు సరిచేసుకున్నాక అన్ని ప్రాంతాల భక్తులనూ అనుమతించనున్నట్టు తెలుస్తోంది. రోజులో గంటకు వెయ్యి మంది చొప్పున రోజుకు గరిష్ఠంగా 20 వేల మందినే అనుమతించే అవకాశముంది. ఆర్జిత సేవలు కొంతకాలం నిలిపివేయనున్నారు. గదుల కేటాయింపు ఉండదు. ఈ నెల 17న లాక్డౌన్ ఎత్తివేసినా 28వ తేదీన పాలకమండలిలో చర్చించాకే దర్శనాలకు అనుమతించే అవకాశం ఉంది.






