వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించం : టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, భార్య, పిల్లలు)తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను వెంటబెట్టుకొని వస్తున్నారని తెలిపారు. ఇలా దర్శనానికి పదే పదే రావడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇకపై కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులను వెంట తీసుకొస్తే, వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో స్పష్టం చేశారు.






