TTD: ఈ నెల 25 నుంచి రథసప్తమి వేడుకలు
ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న రథసప్తమి (Ratha Saptami) వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రథసప్తమికి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నామన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు 85 కౌంటర్ల ద్వారా ఉదయం నుంచి రాత్రివరకు అన్నప్రసాదాలు అందజేసేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.రథసప్తమి రోజున ఉదయం సూర్యప్రభ వాహన సేవ, ఆ తర్వాత చిన్నశేష, గరుడ, హనుమంత (Hanuman) వాహన సేవలు ఉంటాయి. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య చక్రసాన్నం, అనంతరం కల్పవక్ష, సర్వభూపాల, చంద్రప్రభ సేవలు నిర్వహించనున్నారు.






