31 వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ నెల 31 వరకు తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారు. అప్పటి వరకూ స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం సేవలు, కైంకర్యాలను ఏకాంతంగానే కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉన్నతాధికారులు సృష్టం చేశారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనానికి ఎంత మంది భక్తులను అనుమతించాలి, వారి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టైమ్‌స్లాట్ ద్వారా యాత్రికులకు దర్శన టికెట్ల కేటాయింపుపై ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.






