TCS: విశాఖలో రూ.లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్

విశాఖలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్(Data Center) ఏర్పాటుకు టాటా కన్సెలెన్సీ సర్వీసెస్ ( టీసీఎస్) ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఆ సంస్థ విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతోంది. ఆ సమయంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయాలని సంస్థ భావిస్తోందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల టీసీఎస్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ (Chandrasekaran) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ (Visakhapatnam)లో పెట్టనుండటం గమనార్హం. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే, వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.