Supreme Court : ఏపీకి ఒకరు, తెలంగాణకు ముగ్గురు బదిలీ

11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ (Madras) హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత తెలంగాణ (Telangana) హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు, పాట్నా (Patna) హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొంది.