Amaravati: అమరావతి లో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
* For scrolls
* అమరావతి- రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు
* మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి , సీఎం చంద్రబాబు
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
* శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు ఉన్నతాధికారులు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..
* 8 మార్లు ఆర్ధిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన చరిత్ర సాధించారు నిర్మలా సీతారామన్
* పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి ఖాయిలా ప్రమాదం నుంచి వాటిని కాపాడారు ఆమె
* కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి నిర్మలాసీతారామన్ స్పూర్తి
* 34 వేల ఎకరాలను రైతులు రాజధాని కోసం త్యాగం చేశారు.
* అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర భవిష్యత్ కల






