అక్కడి నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి!
దేశీయ విమాన ప్రయాణికులకూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వస్తే కరోనా లక్షణాలు లేకున్నా క్వారంటైన్ తప్పనిసరి అని సృష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ స్పందన లో దరఖాస్తు చేసుకున్నాక రాష్ట్రానికి వచ్చేందుకు అమోదం లభిస్తేనే విమాన టికెట్లు కొనుగోలు చేయాలని సూచించింది. అంతేగాకుండా ఎయిర్పోర్టులో దిగాక కరోనా వైరస్ లక్షణాలు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ క్వారంటైన్లో వారం రోజులు, హోమ్ క్వారంటైన్లో మరో వారం రోజులు తప్పని సరని వెల్లడించింది. తక్కువ కేసులున్న రాష్ట్రాలనుంచి వచ్చేవారికి హోంక్వారంటైన్ తప్పనిసరని సృష్టం చేసింది.






