Jagan: మొంథా తుఫాన్ పై సమీక్ష .. పంట నష్టం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఇటీవల తాడేపల్లిలో (Tadepalli) పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిన మొంథా తుఫాన్ (Cyclone Montha) పరిస్థితులపై ఆయన సమీక్ష జరిపారు. ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్లు ,జిల్లా స్థాయి నాయకులతో తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్ అనంతర పరిస్థితుల్లో రైతులకు వైసీపీ (YCP) నేతలు అండగా ఉండాలని, అవసరమైతే వారి తరఫున పోరాటానికి సిద్ధం కావాలని జగన్ స్పష్టంగా సూచించినట్లు తెలుస్తోంది.






