Raghurama : అవసరమైతే సునీల్ కుమార్ ను సర్వీసు నుంచి తొలగించండి
అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తూ, రాజకీయ సమావేశాల్లో బహిరంగంగా పాల్గొంటూ కుల ఆధారిత రాజకీయ సమీకరణలకు పిలుపునిచ్చిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై (PV Sunil Kumar)తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సర్వీసు నుంచి తొలగించాలని ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర డీఓపీటీ (DOPT) శాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. సునీల్ కుమార్ ఒక రాజకీయ సమావేశంలో పాల్గొన్నారని, అందులో రాజకీయ లబ్ధి కోసం దళితులు, కాపులు ఏకమవ్వాలి. కాపు నాయకుడిని ముఖ్యమంత్రి (Chief Minister) గా, దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని వ్యాఖ్యలు చేశారని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. అధికారి సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ప్రవర్తనా నియామావళికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.






