Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి ఓఎంసీ కేసు

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka) మధ్య అంతర్‌రాష్ట్ర సరిహద్దు, మైనింగ్ లీజుల భౌగోళిక పరిధి గుర్తింపుపై వాదనలు జరిగాయి. మైనింగ్ పరిధి గుర్తింపునకు కమిటీని నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. కమిటీలో ఎవరెవరు ఉండాలన్న దానిపై తమ అభిప్రాయం తెలిపేందుకు సమయం కోరింది. ఈ క్రమంలో తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 12కు వాయిదా వేసింది.