Thiruchanur : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి (NDA Vice President) అభ్యర్థి సీపీ రాధాకృష్షన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న రాధాకృష్ణన్‌కు మంత్రి నారాయణ (Narayana) , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) , ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) , పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు (Tirumala) బయలుదేరి వెళ్లారు.