Nara Lokesh: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సభలో పాల్గొన్న మంత్రి లోకేష్
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…
⦁ సమాజం మనకెంతో ఇచ్చింది… బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది.
⦁ క్లాస్ రూం నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు
⦁ విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి… ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలి
⦁ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి… దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం
⦁ చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయమేసేది
⦁ విద్యా విలువలను పెంపోందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించాం
⦁ తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి చెప్పారు.
⦁ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… ఇది మన బాధ్యత
⦁ పిల్లల కోసం… పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం
⦁ పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించాము… ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారు
⦁ మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి… వాటిని ఎప్పుడూ వాడొద్దు… దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి
⦁ గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవి
⦁ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం
⦁ క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం… పైలెట్ ప్రాజెక్టుగా భామిని మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నాం
⦁ ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాం
⦁ లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చాం… దీని గురించి తల్లిదండ్రులకు లీప్ యాప్ గురించి తెలియచెప్పేలా చేస్తాం
⦁ పిల్లలు ఎలా చదువుకుంటున్నారోననే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు
⦁ భారత దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురావాలని సీఎం ఆదేశించారు… దీన్ని నెరువెరుస్తామని హామీ ఇస్తున్నాను.
⦁ డిప్యూటీ సీఎం నా వెనుకుండి నాకు సలహలు ఇస్తున్నారు.
⦁ విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల్లో నిత్యం చర్చించుకుంటాం
⦁ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మేమంతా కలిసి టీమ్ వర్క్ తో పని చేస్తున్నాం
⦁ ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చండి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దాం.






