Carrier సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో నారా లోకేష్ భేటీ

Carrier సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో సింగపూర్ లోని షాంగ్రీలా హోటల్ లో సమావేశం అయ్యాను. ఏపీలోని అమరావతి, విశాఖపట్నం వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో క్యారియర్ HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్) వ్యవస్థలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశాను. ఏపీలోని టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆహార నిల్వలకోసం స్థిరమైన కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అరుణ్ భాటియా తెలిపారు.