Nandamuri Balakrishna: పార్లమెంటు ఆవరణలో బాలయ్య సందడి
పార్లమెంటు ఆవరణలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సందడి చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), పార్టీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla ) ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Manoharlal Khattar ) తో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు వినతులు సమర్పించారు. అంతకుముందు బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను రోజూ పార్లమెంటుకు వచ్చేందుకు ఉపయోగించే సైకిల్ (Bicycle ) ను చూపించారు. దీంతో బాలయ్య అక్కడ సరదాగా కాసేపు సైకిల్ నడిపారు.







