Roja: నగరి వివాదం: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మహిళా సంఘాల ఆగ్రహం..

ఏపీలో గత కొద్ది కాలంగా నేతల మధ్య మరి ఎక్కువైపోతున్నాయి. తాజాగా నగరి (Nagari) నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి. వైసీపీ (YCP) కీలక నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా (R.K. Roja)పై చేసిన ఆ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వైసీపీ పాలన హయాంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా కూడా తనపై వచ్చిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని ముందడుగు వేసారు.
ఈ నేపథ్యంలో రోజా, రాష్ట్ర మహిళా కమిషన్‌తోపాటు జాతీయ మహిళా కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. మహిళల పరువు నాశనం చేసేలా ఉన్న గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికార వైసీపీ పార్టీ కూడా స్పందిస్తూ, తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తమ పార్టీ మహిళా నేతలకు సపోర్ట్ ఇస్తూ పోస్ట్ చేసి తీవ్రంగా విరుచుకుపడింది.
వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రెటరీ కొర్ల శిరీష (Korla Sirisha) ,గాలి భాను ప్రకాష్ మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడారని, అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే పదవికి అర్హుడే కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సమయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి (Varudu Kalyani) కూడా స్పందిస్తూ, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఆ మాటలు ఉన్నాయన్నారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడిని తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యల సంగతికొస్తే – “రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది.. మార్కెట్లో ఆ మాట ఉంది.. ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె హీరోయిన్ లాగా లేదు, వ్యాంప్‌లా ఉంది. ఈమె వల్ల వాళ్ల నాయకుడికి పిచ్చెక్కిందా? లేక ఆయన పిచ్చి ఈమెకు అంటుకుందా?” అనే మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో వీటిపై సోషల్ మీడియా వేదికగా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మహిళల స్వాభిమానాన్ని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.