Minister Ponguleti: జూబ్లీహిల్స్ అభివృద్ధికి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించాలి: పొంగులేటి
జూబ్లీహిల్స్ పేరుకే సంపన్నుల నియోజకవర్గం, వాస్తవానికి ఇక్కడ మెజారిటీగా ఉన్నది మాత్రం బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లోని కార్మికనగర్, బ్రహ్మ శంకర్ నగర్, రామిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి ప్రజలు, కార్యకర్తలతో సంభాషించారు. రహ్మత్‌నగర్ నుంచి బోరబండ వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ పేదల సంక్షేమాన్ని పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గుర్తించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల వద్ద మంత్రి అజారుద్దీన్ (Azharuddin) , ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి (Raghuram Reddy) లతో కలిసి ఆయన కాలనీ నాయకులతో ముచ్చటించారు. అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు.







