Kolusu Parthasarathy: పెట్టుబడులపై కేసీఆర్ ఇలా మాట్లాడటం తగదు : మంత్రి పార్థసారథి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) భాష, యాస, ప్రాసపై పట్టుందని ఇష్టమెచ్చినట్లు మాట్లాడటం తగదని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పారథసారథి (Kolusu Parthasarathy) అన్నారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పార్థసారథి కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం, పెట్టుబడులపై కేసీఆర్ మాట్లాడిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ధ్వేయమని, ఈ విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, మేం వాటిని పారదర్వకతతో చూపిస్తాం. ఆ పెట్టుబడిదారులు తెలంగాణలో కూడా పెట్టారు. అది తెలుసుకోండి. హైదరాబాద్ నగరానికి బలమైన పునాది ఉంది. దానిని మీరు అభివృద్ధి చేసి ఉండొచ్చు. అసలు పునాదే లేని పరిస్థితుల్లో వైసీపీ ఐదేళ్ల విధ్వంసం నుంచి అమరావతి (Amaravati) అభివృద్ధి చేస్తుంటే, మీరు ఇలా మాట్లాడటం తగదు అని పేర్కొన్నారు.






