Manikam Tagore: ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ : మాణికం ఠాగూర్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వ్యాఖ్యానించారు. మద్యం ముడుపుల కేసులో రూ.11 కోట్లు దొరకటంపై ఆయన స్పందించారు. తొలి విడతలో రూ.11 కోట్ల మధ్యం ముడుపులు పట్టుబడ్డాయి. జగన్ చేసిన దోపిడీ నగదు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉంది. మొత్తం రూ.3,500 కోట్ల స్కామ్ జరిగింది. మద్యం ముడుపులతోనే సినిమాలు, ఆస్పత్రులు నిర్మించారు. ఆ డబ్బుతోనే షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగింది. జగన్ పరిపాలన చేయలేదు, అవినీతి ముఠాను నడిపారు అని విమర్శలు గుప్పించారు.







