Y.S.Jagan: అల్లు అర్జున్ కు జగన్ ప్రత్యేక ట్వీట్ వైరల్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ట్వీట్ కి ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్ల మధ్య జరుగుతున్న సంభాషణలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnam) ఇటీవల మృతి చెందగా, ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సహా మెగా కుటుంబ సభ్యులు వెంటనే అరవింద్ నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరగగా, చిరంజీవి అక్కడే ఉండి తన అత్తగారి కళ్లను ఐ బ్యాంక్ (Eye Bank)కు దానం చేశారు. ఇకపోతే, ఈ విషాద సమయంలో మాజీ సీఎం జగన్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా సంతాపం తెలిపారు. ఆయన ట్వీట్లో “దివంగత నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు. ఈ సందేశంలో జగన్ ప్రత్యేకంగా అల్లు అర్జున్ను ట్యాగ్ చేశారు.
జగన్ ట్వీట్ చూసిన వెంటనే బన్నీ స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలోనే రిప్లై ఇచ్చారు. “థ్యాంక్యూ జగన్ గారు! మీ మంచి మాటలు, సపోర్ట్‌కి మేము నిజంగా కృతజ్ఞులం” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు జగన్ ప్రదర్శించిన మర్యాదను ప్రశంసిస్తుంటే, మరికొందరు బన్నీ స్పందనను గమనిస్తున్నారు.
ఇకపోతే, కనకరత్నమ్మ మృతి పట్ల సినీ వర్గాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. మెగా ఫ్యామిలీతో పాటు సినీ స్నేహితులు కూడా కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఈ బాధను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయనకు రాజకీయ నాయకులు, అభిమానుల నుంచి వస్తున్న మద్దతు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా జగన్ చేసిన సానుభూతి ట్వీట్‌కి బన్నీ కృతజ్ఞతలు చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామం సినీ – రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతూ, నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
ఇలా ఒకరికి ఒకరు గౌరవప్రదంగా స్పందించిన ఈ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. అల్లు కుటుంబానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ సానుభూతి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషాద సమయంలో అల్లు కుటుంబం పట్ల అందరూ చూపుతున్న సహానుభూతి నిజంగా హృదయానికి హత్తుకునే విధంగా ఉందని పలువురు అంటున్నారు.







