NTR: ఎన్టీఆర్ శత జయంత్యువ్సవాల వేళ.. కేంద్ర ప్రభుత్వం తీపీ కబురు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) నుంచి మింట్ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు. ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కోరానని ఈ సందర్భంగా పురందేశ్వరి చెప్పారు. నిర్మలా సీతారామన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్ నుంచి ఆమోదం వచ్చిందని, సంబంధిత అధికారులు 3 ఫొటోల (Photos) ను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతే విడుదల చేస్తారని ఆమె వివరించారు. తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు.