Godavari Pushkarala : గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి
గోదావరి పుష్కరాల (Godavari Pushkarala ) కు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdhury), రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy ) పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనుల తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ ( విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం) పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు.







