Gana Priya: విశాఖ యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో
విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధుతూరి గానప్రియ (Gana Priya)కు అరుదైన అవకాశం లభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా ఢిల్లీ లోని పార్లమెంట్ (Parliament) భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తన గళం వినిపించింది. ఏయూలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న గానప్రియ తండ్రి శ్రీను పెందుర్తిలో సెలూన్ దుకాణం నిర్వహిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించిన గానప్రియ పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి నిర్వహించిన ఎంపిక పరీక్షలో సత్తా చాటారు. దీంతో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యవ వహించే అవకాశం దక్కించుకున్నారు. రాజ్యసభ సెంట్రల్ హాల్లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా (Ombirla) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గొప్పతనంపై ప్రసంగించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.







