ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు
రెండు నెలల విరామం తర్వాత ఆంధప్రదేశ్‌లో నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు పున ప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం, ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి.






