వారి తరలింపులో సమస్యలు వస్తున్నాయి : కృష్ణబాబు
విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వలస కార్మికులలో ఆంధప్రదేశ్‌కు చెందిన వారిని రాష్ట్రానికి తరలించే విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి వస్తున్న వారందరిని సొంత రాష్ట్రాలతో సంబం•ధం లేకుండా క్వారంటైన్‌కి తలరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధప్రదేశ్ తరపున శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక రిపెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అయితే పెయిడ్ క్వారంటైన్‌కు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని, దీని వల్ల గల్ఫ్ నుంచి వస్తున్న వలస కార్మికులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధప్రదేశ్‌కు చెందిన వారిని విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని, దీనిపై విదేశాంగ అధికారులు కూడా సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శంషాబాద్‌లోని విమానాశ్రయంలో ఆంధప్రదేశ్ వారి కోసం ప్రత్యేక కౌంట్ర్ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.






