ఏపీలో 3676 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 105 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3676 కి చేరింది. తాజా కేసుల్లో నెల్లూరు జిల్లాలో 8 తమిళనాడు కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. తాజాగా 34 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2169కి చేరింది. ప్రస్తుతం 885 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 68కి చేరింది.






