ఏపీలో 2137కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 48 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2137కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1142 మంది డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 47కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాల్లో 12 కేసులు ఉన్నాయి. గుంటూరు నుంచి కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన వారికే కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన 140 మందిని ఇప్పటికే గుర్తించారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.






