Amaravati: బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు
• గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు.
• రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు
• ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి
• రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు
• రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం
• బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించాం
• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
• ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు వచ్చాయి
• ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నాను
• ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు. మన దేశానికి కూడా మహిళా ఆర్ధిక మంత్రే ఉన్నారు.
• దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు
• దేశాన్ని ప్రధాన మంత్రి అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే…ఆర్థికమంత్రి ఆదేస్థాయిలో సహకరిస్తున్నారు
• జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగింది
• ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఓ కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఒప్పందం జరిగింది
• ప్లానెటోరియం ఏర్పాటు చేసేందుకు అమరావతిలో స్థలం కూడా కేటాయించాం
• ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, గతంలో విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడే గాడిన పడుతున్నాం
• ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలం అన్న విశ్వాసం మాకు ఉంది
• త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తి అవుతుంది. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయి
• 7 జాతీయ రహదారులు, రైల్వేలైన్లు అమరావతికి కనెక్టు అవుతాయి
• అమరావతి పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం.
• భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తాం.
• విట్,ఎస్ఆర్ఎం, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వచ్చాయి.
• క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ట్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా ప్రణాళిక చేశాం
• 2047కి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అందులో ఏపీది కీలక పాత్ర పోషిస్తుంది
• ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్లీ రీస్ట్రక్చర్ చేసేందుకు కేంద్రం సహకరించింది
• రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రాం వాల్ ధ్వంసం అయితే మళ్లీ రూ.1,000 కోట్లు ఇచ్చి డయాఫ్రాం వాల్ నిర్మాణం చేసేందుకు నిధులిచ్చారు
• 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అలాగే 2028 నాటికి కూడా అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయి
• పరిశ్రమలు రాకుండా పారిపోయిన ఏపీకి మళ్లీ కూటమిపై భరోసాతో పెట్టుబడులు వస్తున్నాయి
• రూ.1.37లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది.
• గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి
• పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది
• సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలు వాడుకుని దేశసంపద పెంచేలా రాయలసీమకు నీళ్లు పారించాలని భావిస్తున్నాం
• ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.
• రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్టటంలో ఈ నీరు కీలకం అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది
• పూర్వోదయ ప్రాజెక్టు కింద ఉదారంగా నిధులు ఇస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి
• కేంద్ర సహకారం వల్ల చాలా వరకూ రాష్ట్రం రికవర్ అవుతోంది.
• నిలదొక్కుకుని దేశప్రగతికి, సంపదకు బ్యాక్ బోన్ గా ఏపీ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను.
• కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్.






