Chandrababu,: ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు, లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu,) , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ( Lokesh) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ (CII) తో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను వీరు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ లో భారత పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు జరుగనుంది. ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా ( Amit Shah) , నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తోనూ సీఎం భేటీ కానున్నారు.