Chittoor Court: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనంగా మారిన అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ( Kathari Anuradha), మోహన్ (Mohan) దంపతుల హత్య కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు (N. Srinivasa Rao) ఇటీవల తీర్పు ఇచ్చారు. నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ (Sriram Chandrasekhar) అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3) మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4) మునిరత్నం వెంకటేష్( ఏ5) లు దోషులుగా తేలారు.






