Chandrababu: భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
⦁ విద్యార్ధుల కోసం పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, క్రీడా ప్రాంగణం గురించి అడిగి తెలుసుకున్న సీఎం
⦁ వివిధ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్సాహపరిచిన సీఎం
⦁ స్టెమ్ ల్యాబ్ పరిశీలించిన సీఎం
⦁ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లో సీఎంకు విద్యార్థినుల ప్రజెంటేషన్
⦁ ల్యాబ్ లో విద్యార్థినుల ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును అభినందించిన ముఖ్యమంత్రి
⦁ పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
⦁ పేరెంట్స్ ఏం చదువుకున్నారని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
⦁ పిల్లలను బాగా చదివించండి… వాళ్లకు మీరు అందించే ఆస్తి చదువేనని చెప్పిన సీఎం
⦁ మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉందా..? లేదా…? అని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
⦁ గతానికంటే చాలా బాగుందని చెప్పిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి
⦁ మిమ్మల్ని చూసి ఆనందంగా ఉందన్న విద్యార్థులు… తమ ప్రాంతానికి తరుచూ వస్తూ ఉండండని ముఖ్యమంత్రి కోరిన విద్యార్థులు
⦁ ఓ క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.
⦁ రెయిన్ ఫాల్ పై వీడియో ప్రదర్శించి దాని ఆధారంగా ప్రశ్నలు.
⦁ మంచి మార్కులు వచ్చిన వారికి చప్పట్లు కొట్టించిన ముఖ్యమంత్రి
⦁ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ






