Chandrababu: దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి సర్దార్ : చంద్రబాబు
 
                                    సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. భారత రాజ్యాంగం (Constitution of India) లో పౌరులకు ప్రాథమిక హక్కులు (Fundamental rights) మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు ఆయనని కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని అన్నారు. దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తిని నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.











 
                                                     
                                                        