Chandrababu: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న చంద్రబాబు, నారా లోకేష్
భామినిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించిన సీఎం, విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించిన సీఎం. లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్ధుల సామర్ధ్యాలను స్వయంగా పరీక్షించిన ముఖ్యమంత్రి, ఎలా నేర్చుకోవాలో వారికి వివరించిన ముఖ్యమంత్రి. విద్యా శాఖలో అమలు చేస్తున్న వివిధ సంస్కరణల్ని ముఖ్యమంత్రికి వివరించిన మంత్రి నారా లోకేష్. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్ధ్యాలు పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించిన సీఎం. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లితండ్రులతో స్వయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. విద్యతో పాటు వివిధ నైపుణ్యాలను పెంచే దిశగా ఉపాధ్యాయులూ పనిచేయాలని సూచించిన సీఎం.






