London: సీఎం చంద్రబాబు లండన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ (London) లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. నవంబర్ 14, 15న విశాఖ (Visakhapatnam) లో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రావాలని లండన్‌లోని పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు. సీఎం వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా (Karthikeya Mishra) తో పాటు అధికారుల బృందం కూడా వెళ్తుంది.