Banks: మెగా బ్యాంకుల విలీనం.. ఈ 4 బ్యాంకులు ఉండవు! మరోసారి తెరపైకి బ్యాంకుల విలీనం

ప్రభుత్వం మరో 4 బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయనుంది.
ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ (Indian banking sector)లో మరో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. త్వరలో కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (PSBs) మెర్జింగ్ జరిగే అవకాశం ఉంది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, స్మాల్ స్టేట్-ఓన్డ్ బ్యాంకులను లార్జ్ బ్యాంకులతో మెర్జ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కంట్రీ క్రెడిట్ గ్రోత్, ఫైనాన్షియల్ రీఫార్మ్స్ నెక్స్ట్ ఫేజ్‌కి సపోర్ట్ చేసేలా స్ట్రాంగ్ బ్యాంకులను క్రియేట్ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మెర్జ్ అయ్యే బ్యాంకులు
ప్రపోజల్‌లో ఉన్న స్మాల్ బ్యాంకులు ఇవే..
– ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)
– సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI)
– బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)
– బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM)
మెర్జ్ అయ్యేది వీటిలో..
– పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
– బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)
– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
మెర్జింగ్ ప్లాన్‌ని వివరించే ఇంటర్నల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ‘రికార్డ్ ఆఫ్ డిస్కషన్’ మొదట క్యాబినెట్ స్థాయిలో సీనియర్ అధికారులు, ఆపై ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) రివ్యూ చేస్తుంది. చర్చలు, సంప్రదింపులు FY27లో జరిగే అవకాశం ఉంది. అదే సంవత్సరంలోపు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కన్సాలిడేషన్ డ్రైవ్
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2017, 2020 మధ్య, కేంద్రం 10 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా మెర్జ్ చేసింది. దీంతో 2017లో 27గా ఉన్న మొత్తం PSBల సంఖ్య 12కి తగ్గింది.
ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయ్యాయి. అలానే కెనరా బ్యాంక్‌తో సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయింది. ఎస్‌బీఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు కలిశాయి. అనుబంధ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి.
ప్రభుత్వం ఇంకా ఎందుకు మెర్జ్ చేస్తోంది?
నివేదికల ప్రకారం, NITI ఆయోగ్ కొన్ని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు SBI, PNB, BoB, కెనరా బ్యాంక్ మాత్రమే ఉంచుకోవాలని సూచించింది. మిగిలిన వాటిని విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే కొత్తగా IOB, CBI వంటి చిన్న PSBలను మెర్జ్ చేయాలని నిర్ణయించారు.
ఈ ప్లాన్ నేటి పరిస్థితులకు సరిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫిన్‌టెక్, ప్రైవేట్ బ్యాంకులు వేగంగా విస్తరిస్తున్నాయి. వాటికి పోటీ ఇవ్వాలంటే ప్రభుత్వ బ్యాంకులు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. లార్జ్, క్యాపిటల్ ఎక్కువగా ఉన్న బ్యాంకులు ఎఫిషియంట్‌గా ఉంటాయని, అంతర్జాతీయంగా కూడా మరింత పోటీ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.