చంద్రబాబుకు ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన రోడ్డు మార్గంలో అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కూడా ఉన్నారు. రెండు నెలల తర్వాత రాష్ట్రంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబుకు దారి వెంబడి తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తెలంగాణ నుంచి ఏపీకి చేరుకునే గరికపాడు చెక్‌పోస్టు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది స్వాగతం పలికారు. వివిధ కూడళ్లలో కూడా ఆయనను ఆహ్వానం లభించింది. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శ్రేణులకు మహానాడు సందేశం ఇస్తారు.






