ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. అందుకు ఇదే నిదర్శనం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు, కొప్పరికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. కడప జిల్లా కొప్పరి లో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కొప్పర్తి విశాఖ`చెన్నై కారిడార్ కిందకు వస్తుందని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,137 కోట్లను ఖరు ్చ చేయనుందన్నారు. ఈ హబ్‌తో 54,5000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.2,786 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమకు లద్ధి చేకూరనుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ రెండు స్మార్ట్ సిటీలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు త్వరలో కేంద్రం అంగీకారం తెలపనుంది. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా ఈ నిధులు విడుదలవుతాయి. గత ఐదేళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిరది. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎలా ఉందో చూస్తున్నాం అని తెలిపారు.