Bpcl: ఏపీలో మరో భారీ పెట్టుబడి… రూ.95వేల కోట్లతో

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (Bpcl) రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95 వేల కోట్లు పెట్టుడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే మూడు రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటుకు చేయడానికి ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh )ను ఎంచుకుంది. రూ.6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)కి రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సెబీ (లిస్టింట్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్స్ -2015 లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపాం. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్ (Arcelor Mittal) రూ.1,61,198 కోట్లు, ఇంధన రంగంలో రిలయన్స్ రూ.65 వేలకోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. విశాఖలో టీసీఎస్(TCS) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ అంగీకరించింది.