పాస్‍పోర్టు సేవల్లో ఏపీ పోలీసులకు.. ప్రశంసలు

పాస్‍పోర్టు వెరిఫికేషన్‍లో ఆంధప్రదేశ్ పోలీసులు ఉత్తమ సేవలందిస్తున్నారని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. పాస్‍పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశీ మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారికి పోలీస్ వెరిఫికేషన్ వేగంగా చేసి త్వరగా పాస్‍పోర్టు వచ్చేలా చేస్తున్నందుకు ఆంధప్రదేశ్ పోలీసులకు ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఆంధప్రదేశ్ పోలీసులకు ఈ అవార్డు రావడం ఇది నాలుగోసారి. అలాగే దేశ వ్యాప్తంగా 2020-21కి ఇచ్చిన ఈ పురస్కారాల్లో ఉత్తమ పాస్‍పోర్ట్ అధికారి అవార్డు విజయవాడ ప్రాంతీయ పాస్‍పోర్ట్ కార్యాలయ అధికారి డీఎస్‍ఎస్ శ్రీనివాస్‍కు దక్కింది. మెరుగైన సేవలందించారని ఆయన్ని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.