RoboCop: విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్
రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్ (RoboCop) ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా (Alok Bohra), డీఆరఎం లలిత్బోహ్రా ఆవిష్కరించారు. ఏఐ (AI), ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారి చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో సహాయపడుతుంది. రద్దీ పెరిగితే ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది అని అధికారులు వివరించారు. విశాఖకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ రోబోకు రైల్వే పోలీసులు ఏఎస్పీ అర్జున్ (ASP Arjun) అని పేరు పెట్టారు. డివిజినల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకేదుబే పాల్గొన్నారు.






