Amaravati: రాజధానిలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి (Amaravati)లో 30 శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ 133.3 కి.మీ పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల (Parks) అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అంబ్ బ్లూ కాన్సెప్ట్‌కు ప్రణాళిక రూపొందించాం. జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుంది. 22 రోడ్లలో రెండువైపులా బఫర్ జోన్లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతుంది. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నాం. 20 గ్రామాల పరిధిలో భూసమీకరణకు రైతులకు ఇవాళ్టికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తాం. సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.






