CM Chandrababu : సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం : మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సింగపూర్ (Singapore)పర్యటన విజయవంత మైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. సచివాలయంలో లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎంవోయలూ చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్ ద్వారా ఆర్సెల్లార్ మిత్తల్ (ArcelorMittal) ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీట్‌ఫ్లాంట్, డేటా సెంటర్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడిరచారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.
ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99 పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు. టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99 పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? వైసీపీ తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబబడులు రాకుండా సింగపూర్ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ`మెయిల్ పంపించారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని అందులో పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కలిసికట్టుగా పనిచేస్తాయి. ఏపీలో మాత్రం పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైసీపీ లేఖ రాస్తుంది. ఇలా లేఖలు పంపితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు? ఇలా చేస్తే నష్టపోయేది తెలుగువారే అని అన్నారు.