పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ విద్యాశాఖా మంత్రి

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తేల్చి చెప్పారు. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. అయితే పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రులు కోరడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలే దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పరీక్షలను రద్దు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ఎంత మాత్రమూ సమర్థనీయం కాదని, అది ఏమాత్రం సరికాదని అన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ అత్యంత ప్రామాణికమని, మంత్రి సురేశ్ పేర్కొన్నారు.