Chandrababu: కష్టించి పనిచేసేవారికి వాటంతట అవే వస్తాయి : చంద్రబాబు
ఇక నుంచి పార్టీకి ప్రతి రోజూ ఐదు గంటల సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) నల్లజర్లలో గోపాలపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసే విశ్వవిద్యాలయం టీడీపీ. అందువల్ల పదవుల కోసం ఏ ఒక్క కార్యకర్త పాకులాడాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవులు వాటంతట అవే వస్తాయి. నాయకుల చుట్టూ తిరిగి రికమెండేషన్లు చేయించాల్సిన అవసరమే లేదు. అందరి వ్యక్తిగత డేటా నా వద్ద ఉంది అని తెలిపారు. విశ్రమించని కార్యకర్తలు ఉన్నంతవరకు టీడీపీ (TDP)కి తిరుగులేదన్నారు. వారికి ఆగ్రహం వస్తే పార్టీ ఇబ్బందులకు గురవుతుందని, అందుకే ప్రతి నాయకుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆదేశించారు. కష్టకాలంలో ఎదురైన ప్రతి ఇబ్బందినీ అధిగమించి పడిలేచిన కెరటంలా టీడీపీ విజయదుందుభి మోగించిందని తెలిపారు.






