High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గా ప్రమాణం చేసిన జస్టిస్ దోనాడి రమేశ్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేశ్ (Donadi Ramesh) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Thakur) ప్రమాణం చేయించారు. జస్టిస్ దొనాడి రమేశ్ స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర్లోని కమ్మపల్లి. అన్నపూర్ణమ్మ, నారాయణనాయుడు దంపతులకు 1986 జూన్ 27న జన్మించారు. జస్టిస్ రమేశ్ తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఏపీ బార్ కౌన్సిల్‌లో 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని, హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. జస్టిస్ పీఎస్ నారాయణ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో జూనియర్ న్యాయవాదిగా చేరి వృతి మెలకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబరు నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా(ఎస్‌జీపీ)గా సేవలు అందించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్ (Allahabad) హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 జులై 24న బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.