యూరప్ లో అమరరాజా పెట్టుబడులు
అంతర్జాతీయ విపణిలో అమరరాజా సంస్థలు పెట్టుబడులు పెట్టి ప్రగతి వైపుకు దూసుకుపోతోంది. ఇప్పటికే దేశంలో అగ్రగామిసంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న అమరరాజా సంస్థలు మరింత ముందుకు దూసుకుపోతోంది. విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తనదైన బ్రాండ్‌ను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో అమరరాజా యూరప్ కేంద్రంగా ఇనోబ్యాట్లో పెట్టుబడులు పెట్టినట్టు ఆ సంస్థ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ విక్రమ్గౌరినేని తెలిపారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తద్వారా భారత దేశ గొప్పతనం ప్రపంచ దేశాలకు అవగతం అవుతుందన్నారు. ఎందరో నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.






