షికాగో నుంచి ప్రవాసాంధ్రుల రాక
అమెరికాలోని షికాగో నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 34 మంది ప్రవాసాంధ్రులు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వారందరినీ ఆర్టీసీ బస్సులో విజయవాడ భవానీపురం లోని హరిత బరంపార్కు హోటల్ వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారందరికీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి పెయిడ్ క్వారంటైన్‌కు పంపిస్తామని చెప్పారు. తర్వాత వారి నివాసాలకు పంపిస్తామన్నారు.
హైదరాబాద్‌కు మరో 168 మంది రాక
అమెరికాలోని చికాగో నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం ఆదివారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 168 మంది భారతీయులతో హైదరాబాద్‌కు వచ్చింది. వందే భారత్ మిషన్ కింద విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే అతి పెద్ద తరలింపు పక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మరో విమానం తెలంగాణలో చిక్కుకుపోయిన అమెరికా, బ్రిటన్ జాతీయులతో ఢిల్లీకి వెళ్లింది. 68 మంది అమెరికా, బ్రిటన్ జాతీయులతో ఎయిరిండియా విమానం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ నుంచి వారిని ఇతర విమానాల ద్వారా వారి స్వదేశాలకు తరలిస్తారు.






