Washington: ట్రంప్ ప్రమాణస్వీకారానికి తరలివస్తున్న దేశాధినేతలు..
నవంబర్ 5న భారీ మెజారిటీతో విజయం సాధించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్, DCలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి .. ఈకార్యక్రమం జరగనుంది. దేశాధ్యక్షుడి పట్టాభిషేకానికి భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నేతలు, కంపెనీల ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి.
భారత్ నుంచి జై శంకర్..(jai shankar)
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జైశంకర్ ఇన్కమింగ్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు మరియు కార్యక్రమానికి హాజరయ్యే ఇతర ప్రముఖులతో కూడా సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొంది.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (jingping)కు ఆహ్వానం..
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు డొనాల్డ్ ట్రంప్ నుండి వ్యక్తిగత ఆహ్వానం అందింది, ట్రంప్ , జిన్ పింగ్…జూన్ 2019లో జపాన్‌లోని ఒసాకాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు. ప్రస్తుతం అమెరికా గట్టి ప్రత్యర్థి , పోటీదారు అయిన చైనా అధ్యక్షుడికి ఆహ్వానం పంపడం ద్వారా.. పోటీ కేవలం వాణిజ్యపరంగా మాత్రమే అన్న సందేశాన్ని ట్రంప్.. చైనాకు పంపినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. అయితే జిన్ పింగ్.. తన స్థానంలో సీనియర్ అధికారిని పంపవచ్చని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్ లేదా విదేశాంగ మంత్రి వాంగ్ యి జనవరి 20న చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(meloni)
ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ట్రంప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది, ఆమె ఇప్పటికే ట్రంప్ తో చాలా స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇటీవలి ట్రంప్… పనామా కెనాల్ వ్యాఖ్యలను సమర్థించారు.ట్రంప్ ఉద్దేశం వేరు.. అందరూ అర్థం చేసుకుంటున్నది వేరన్నారు మెలోనీ.
హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్(viktor orban) ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన విదేశీ మిత్రులలో ఒకరైన ఓర్బన్, అతను దేశం తరపున హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో ఆయన ఎన్నికల విజయం తర్వాత మార్-ఎ-లాగో వద్ద ట్రంప్‌ను సందర్శించారు.
బ్రెజిల్‌కు చెందిన జైర్ బోల్సోనారో(jair bolsonaro)
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రకటించారు. 2023 తిరుగుబాటు ప్రయత్నానికి సంబంధించిన దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందాలని కోరుతూ, X లో తన “ఆహ్వానాన్ని స్వీకరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే(nayib bukele)నవంబర్‌లో ట్రంప్ విజయం సాధించినందుకు అభినందించిన మొదటి ప్రపంచ నాయకులలో ఒకరు. ఆయన కూడా ఈ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశముంది.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ
2023లో ఎన్నికైన, డోనాల్డ్ ట్రంప్‌కి కీలక మిత్రుడు జేవియర్ మిలీ(javier milei)కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రిపబ్లికన్ నాయకుడితో మిలీకి ఉన్న మంచి సంబంధాన్ని హైలైట్ చేస్తూ, అధ్యక్షుడి ప్రతినిధి డిసెంబర్లో దీనిని ధృవీకరించారు.
జపాన్ యొక్క తకేషి ఇవాయా(takeshi iwaya)
జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అయిన NHKకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవాయా మాట్లాడుతూ, “ట్రంప్ పరిపాలనతో విశ్వసనీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దీర్ఘకాల US మిత్రదేశమైన జపాన్, ట్రంప్ రెండవ పదవీకాలంలో బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలని భావిస్తోంది.
మరోవైపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ కుటుంబం, ఇతర వ్యాపార వాణిజ్యవేత్తలు ఈకార్యక్రమానికి హాజరుకానున్నారు.






