US Visa: అమెరికా వీసా ప్రక్రియ పునః ప్రారంభం.. ట్రంప్ పరిపాలనా విభాగం ఆదేశాలు జారీ..

మే 27వ తేదీన విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను నిలిపివేసిన ట్రంప్ పరిపాలన విభాగం.. లేటెస్టుగా కొత్త ఆదేశాలు జారీ చేసిందీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న US కాన్సులర్ సేవలను విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ (Trump) పరిపాలన విభాగం ఆదేశాలిచ్చింది.. జూన్ 18న ఒక కేబుల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ కాన్సులర్ మిషన్లకు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కొత్త ఆదేశాన్ని పంపారని రాయిటర్స్ నివేదించింది.
ముఖ్యంగా ట్రంప్ గద్దెనెక్కాక.. విదేశీ విద్యార్థుల రాకపై గట్టి నిఘా ఉంచింది. ముఖ్యంగా వారి వీసాల్లో అధికశాతం తిరస్కరణకు గురయ్యాయి కూడా… దానికి తోడు విదేశీ విద్యార్థులను అనుమతించే విశ్వవిద్యాలయాలపై గట్టి నిఘా ఉంచింది కూడా. ఇప్పుడు లేటెస్టుగా … తిరిగి వీసాల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది కూడా..
“రాజకీయ కార్యకలాపాల చరిత్రను ప్రదర్శించే దరఖాస్తుదారులు, ముఖ్యంగా హింసతో లేదా పైన వివరించిన అభిప్రాయాలు మరియు కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, వారు యునైటెడ్ స్టేట్స్‌లో అలాంటి కార్యకలాపాలను కొనసాగించే అవకాశాన్ని మీరు పరిగణించాలి” అని కేబుల్ అధికారులను ఆదేశించింది.వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిరంగంగా ఉంచమని మరియు కాన్సులర్ అధికారుల సమీక్షకు అందుబాటులో ఉంచమని కూడా కోరవచ్చు. పాటించడంలో విఫలమైతే “నిర్దిష్ట కార్యకలాపాలను తప్పించుకోవడానికి లేదా దాచడానికి” చేసే ప్రయత్నంగా పరిగణించబడుతుంది మరియు వీసా తిరస్కరణకు దారితీయవచ్చు.
విస్తృతమైన సోషల్ మీడియా పరిశీలనకు వీలు కల్పించడానికి మరియు అంతర్జాతీయ విద్యార్థులు 15% కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వెళ్లే అభ్యర్థుల దరఖాస్తులను వేగవంతం చేయడానికి… ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్కువ F, M మరియు J వీసా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడాన్ని పరిగణించాలని కొత్త ఆదేశం కాన్సులేట్‌లను నిర్దేశిస్తుంది.